NRI ( Non Resident Indian ) అంటే సంపాదన కోసం విదేశాలలో ఉంటూ, అక్కడే తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నవారు. అయితే ఇలాంటి వారికి సాధారణంగా రిటైర్మెంట్ సమయంలో గాని మాతృదేశం  గుర్తుకు రాదు, కానీ ఈరోజుల్లో  ఉన్నాయంటే విదేశాలలో ఒకే సంపాదనతో కుటుంబాన్ని ఒదులుకోని అక్కడ ఉండటం కంటే దేశం లో ఒకే దానితో సరిపెట్టుకొని ఫామిలీ కి దగ్గరగా, ఫామిలీ మెంబెర్స్ కు చేరువగా ఉండచ్చు అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా విదేశాలలో ఉద్యోగ అవకాశాలు సైతం పెద్దగా ఉండకపోవడం కూడా NRI లు మాతృ దేశం వైపు చూడటానికి ఒక ముఖ్యమైన కారణం. అయితే పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ మీరు ఒక అయితే ఇటువంటి పరిస్థుతులలో మీరు ఒక NRI అయ్యి ఉంటె గనుక హైదరాబాద్ లో లేదా మరి ఏ ఇతర సిటీ లో అయినా ఉద్యోగం సంపాదించడానికి మీరు గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇపుడు తెలుసుకుందాము.

అంచనాలను అందుకునేలా      

పూర్వం రోజులకి మల్లె ఫారిన్ లో కొన్నాళ్ల జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటె చాలు, ఇండియా లో జాబ్ సంపాదించడం ఈజీ అనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇండియా లో కూడా జాబ్ ల విషయంలో చాలా కాంపిటీషన్ నెలకొని ఉంది. నిజానికి చాలా వరకు సేల్స్ ఇంకా మార్కెటింగ్ జాబ్స్ విషయంలో ఇతర  ఎక్స్పీరియన్స్  ఉన్నప్పటికీ ,  పెద్దగా ఉపయోగపడదు, ఆ దేశంలో కస్టమర్స్ తో డీల్ చెయ్యటం, ఇండియన్ కస్టమర్స్ తో డీల్ చెయ్యటం రెండు వేరు వేరు విషయాలు.  కాబట్టి, మీరు ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నట్లైతే గనుక మీరు పనిచేస్తున్న ఇండస్ట్రీ లో ఉద్యోగ అవకాశాలను గురించి కొంచెం పరీశీలించాలి.

మిమ్మల్ని మీరు అడ్వర్టైజ్ చేసుకోవాలి

అన్నిటి కంటే ముఖ్యంగా మీరు ఇండియా కి వచ్చి జాబ్ చెయ్యాలనుకుంటే చెయ్యాల్సిన పనులలో మొదటి పని మీకు ఆన్ లైన్ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవడం. LinkedIn, Naukri, Shine, Monster,  Mintly లాంటి ప్లాట్ ఫారం లలో మీకు ఒక ప్రొపెర్ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకొని, మీ ఎడ్యుకేషన్  qualification ఇంకా జాబ్ ఎక్స్పీరియన్స్ లను అప్ డేట్ చేసుకొని, మీ ప్రొఫైల్ కి తగ్గట్టు సరిపోయే అవకాశాలను వెతికి సంపాదించుకోవచ్చు.

ఫ్రెండ్స్ సర్కిల్ ను సంప్రదించడం

ఫ్రెండ్స్ నెట్వర్క్ ను పెంచుకోవడం ఉద్యోగం సంపాదించటం కోసం కూడా ఒక్కోసారి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు NRI అయ్యి ఉండి, చాలా కాలం  పాటు ఇండియన్ జాబ్ ఇండస్ట్రీ తో గనుక టచ్ కోల్పోయినట్లయితే గనుక ఖచ్చితంగా మీరు చెయ్యాల్సిన ఓ ముఖ్యమైన పని మీ పాత ఇండియన్ ఫ్రెండ్స్ తో తిరిగి మాట్లాడటం. వారి ద్వారా ఉద్యోగ   అవకాశాలను సంగ్రహించడం మీకు సులభం అవుతుంది. ఫ్రెండ్స్ ఉంటె పాడైపోతారనే ఆలోచన వేరు గాని, ఇలాంటి సమయంలో నిజానికి సరైన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటె ఎంతగానో ఉపయోగపడుతుంది.

శాలరీ ను గురించి తెలుసుకోవడం

మీరు NRI గా ఉండి, అక్కడ సంపాదించే జీతం తో ఇక్కడ చేరబోయే ఉద్యోగంలో సంపాదనను పోల్చి చూసుకోకండి. అక్కడ వేరు, ఇక్కడ వేరు. అక్కడ మీ ఎక్స్పీరియన్స్ వేరు, ఇక్కడ ఎక్స్పీరియన్స్మీ వేరు. కాబట్టి అక్కడ మీ సంపీడన కంటే ఇక్కడ మీ సంపాదన తక్కువ ఉండవచ్చు అలా అని నిరుత్సాహ పడకండి. అక్కడ ఉండే ఖర్చులతో పోలిస్తే ఇక్కడ ఖర్చులు తక్కువే గనుక ఈ సంపాదన మీకు సరిపోతుంది.

India లో జాబ్ ఇండస్ట్రీ ని తెలుసుకోండి

ఇదివరకు చెప్పినట్టుగానే మీరు ఇండియా ను  ఒదిలి చాలా కాలం అయినా లేదా మీరు ఇండియన్ ఇండస్ట్రీ పాతాళ అంత అవగాహనా లేకపోయినా మీరు ముందు వాటిపైన అవగాహనా పెంచుకోవడం చాలా అవసరం. కాబట్టి మీరు మీకు కుదిరిన విధంగా రకరకాలుగా ఇండియా కు ముందుగా ఇండియా కి వచ్చి లేదా వేరే ఏదో విధంగానో కావాల్సిన అవగాహనను ఏర్పరుచుకోవాలి.

మీరు చేస్తున్న కంపెనీ లోనే ఇండియా లో అవకాశాలను చూసుకోవడం

ఒకవేళ మీరు చేస్తున్న కంపెనీ తాలూకా ఆఫీస్ ఇండియా లో కూడా ఉన్నట్లయితే మీకింకా వేరే బాధాలేవీ ఉండవు ఎందుకంటే, చక్కగా అదేకంపనీ తోనే కొనసాగుతూ ఇండియా కు ఈజీ గ షిఫ్ట్ అవ్వచ్చు. మరి ఇంత ఈజీ ఆప్షన్ చేతులో ఉంచుకొని ఎవరైనా వేరే దారులు వెతుక్కుంటారా ? మీరుకూడా ట్రై చెయ్యండి . ఈరోజుల్లో చాలా వరకు ఇంటర్నేషనల్      కంపెనీ లు ఇండియా లో ఆఫీస్ లను కలిగి ఉన్నాయి కాబట్టి ఇది అంత కష్టమైనా పని కాదు.

అయితే మనం ఇప్పటి వరకు NRI లు ఇండియా లో ఉద్యోగ అవకాశం కోసం చూసేటప్పుడు గమనించాల్సిన కొన్ని అంశాలను తెలుసుకున్నాం, అయితే ఇప్పుడు హైదరాబాద్ లో న్రి లకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దాం.

IT ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఎంత అభివృద్ధి చెందిందో వేరేగా చెప్పాల్సిన పనే లేదు. చాలావరకు ఇంటర్నేషనల్ కంపెనీ లు హైదరాబాద్ లో

ఉన్నాయి కాబట్టి IT ఇండస్ట్రీ లో పని చేసేవారికి హైదరాబాద్ ఉద్యోగం వెతుక్కోవడానికి ఒక మంచి ప్లేస్ అనే చెప్పాలి. IT లో కూడా చాలా కంపెనీలు, మల్లి వాటిలో చాలా అవసరాలు ఉన్నందున వాటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మీరు

IT ఇండస్ట్రీ లో పని చేసే NRI అయితే గనుక ఖచ్చితంగా మీకు హైదరాబాద్ లో మీ ఇండస్ట్రీ లో ఉద్యోగం సంపాందించడం అంత అసాధ్యమైన పని కాదనే చెప్పాలి. ఉన్న ఆన్లైన్  సోర్సెస్ తో అది ఇంకా చాలా సింపుల్ గ కూడా మారింది.

కాబట్టి  ఆల్ ది బెస్ట్.

Language