NRI లు అంటే ఒకప్పుడు అదొక ప్రత్యేక గౌరవం.  అయితే ఇపుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కడైయతే ఏంటి ఎక్కువ సంపాదన దేశంలోనే ఒస్తున్నపుడు విదేశాలకు ఎందుకు వెళ్ళటం అని ఆలోచించే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే విదేశాలలో already స్థిరపడిన NRI లు సైతం ఇపుడు విదేశాలలో స్థిరత్వం ఏర్పర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా విదేశాలలో చాలా కలం నుండి ఒక స్థిరం ఉద్యోగంలో ఉండి ఇపుడు ఇండియా లో ఒక కొత్త స్థిరమైన ఉద్యోగాన్ని ఏర్పర్చుకోవటం అంటే అంత సులభమైన విషయమేమి కాదనే చెప్పాలి. అయితే ఇండియా లో అంటే మళ్ళి చాలా సిటీస్ ఉన్నాయి కనుక ప్రత్యేకించి వైజాగ్ లో NRI లకు ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం.

వైజాగ్, ప్రస్తుతం విభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో బాగా అభివృద్ధి చెందిన ఒక సిటీ. ఈ సముద్ర తీర ప్రాంతం చాలా రకాలుగా అభివృద్ధి ఇప్పటికే చెందింది కానీ ఇంకా IT దృష్ట్యా చూసినట్లయితే అంత అభివృద్ధి కాలేదనే చెప్పాలి. అయితే IT ఇంకా అభివృద్ధి చెందుతున్న స్థాయిలో ఉన్న వైజాగ్ లో NRI లకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అని

ఆలోచిస్తే అది చాలా పెద్ద టాపిక్ ఏ అవుతుంది. కాబట్టి ఇండస్ట్రీ ల వారీగా ఉద్యోగ అవకాశాల పైన ఒక లుక్ వేద్దాం.

IT ఇండస్ట్రీ  

ఇండియా లో కాస్తో కూస్తో IT ఇండస్ట్రీ అభివృద్ధి చెందింది అంటే దానిలో ముందున్న నగరాలలో బెంగళూరు, హైదరాబాద్ ఉంటాయి. అయితే IT ఇండస్ట్రీ  వైజాగ్ లో వెనకబడి ఉందనే చెప్పాలి. కాబట్టి మీరు ఇతర దేశాలలో IT ఉద్యోగిగా మంచి పొజిషన్ లో చేస్తూ ఉండి ఇప్పుడు ఇండియా కు అందులోను వైజాగ్ కు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉండి ఉన్నట్లైతే గనుక మీకు వైజాగ్ లో పెద్ద ఎక్కువగా అవకాశాలు లేవనే చెప్పాలి. Wipro అని, TechM అని అరకొర కంపెనీ లు ఉన్నాయి కానీ వాటి ద్వారా పెద్దగా అవకాశాలు ఉండవనే చెప్పాలి. మీరు ఆల్రెడీ విదేశాలలో ఏదో ఒక టెక్ కంపెనీ లో పెద్ద పొజిషన్ లో ఉండి ఉంటె మీకు ఇండియా లో హైదరాబాద్ ఇంకా బెంగుళూరు బెటర్ ఆప్షన్స్ అనే చెప్పాలి. మీరు ఒకవేళ ఫ్రెషర్ గా స్టార్ట్ చేస్తూ ఉంటె వైజాగ్ పర్లేదుగాని లేదంటే వైజాగ్ అంత మంచి ఛాయస్ కాదనే చెప్పాలి.

మార్కెటింగ్ ఇండస్ట్రీ   

మార్కెటింగ్ ఇండస్ట్రీ సైతం వైజాగ్ లో పెద్దగా ఆచరణనను నోచుకోలేదని చెప్పాలి. అయితే ఇది తీరప్రాంత నగరం కాబట్టి మార్కెటింగ్ కు, ట్రేడింగ్ కు కూడా కొంతవరకు మనకు మార్కెటింగ్ లో అవకాశాలు ఉంటాయనే చెప్పాలి. అయితే అంత పెద్ద పెద్ద ఇండస్ట్రీ లు కంపెనీ లో వైజాగ్ లో ఎం లేనందున ఎదుగుదలకు ఇంకా విదేశాల నుంచి షిఫ్ట్ అవ్వటానికి వైజాగ్ అంత మంచి ఆప్షన్ కాకపోవచ్చు. ఇలా ఇండస్ట్రీల వారీగా చూస్తే వైజాగ్ అంతగా అభివృద్ధి చెందిన నగరం కూడా కాదనే చెప్పాలి. అయితే మీ అంతటా మీరు ఒక చిన్న స్టార్ట్ అప్ లేదా కంపెనీ ఏదైనా పెట్టే ఆలోచన గనుక మీకు ఉన్నట్లయితే మీ పని స్థిరపడే అవకాశం ఎక్కువగానే ఉంటాయి.     

కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువగా క్రేజ్ లో ఉన్న స్టార్ట్ అప్ ల పైన మీకు అవగాహనా ద్రుస్తి ఉంది మీ అంత మీరు మీకు ఉన్న అవగాహనా ఎక్స్పీరియన్స్ తో మీరు ఒక స్టార్ట్ అప్ తయారుచేయగలననే ధైర్యం ఉంటె you are good to go.

వైజాగ్ లాంటి బ్యూటిఫుల్ సిటీ లో సెటిల్ వలనే ఆలోచన రావడం ఏమాత్రం తప్పు కాదు అయితే మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ముందు అడుగు వేస్తే ఇండియా లో మీ ఉద్యోగ స్థిరత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది.

Language