ఆడవారు కెరీర్ అంత సీరియస్ గ తీసుకోరా, లేదా చుట్టుపక్కల వారు ఆడవాళ్ళ కెరీర్ ను అంత సీరియస్ గ తీసుకోరు తెలియదు గాని. పెళ్లి తర్వాత ఆడవాళ్ళ కెరీర్ కు వెంటనే గాని లేదా పిల్లలు పుట్టిన తర్వాత

గాని ఖచ్చితంగా కామా లేదా ఫుల్ స్టాప్ పడే  తీరుతుంది. ఆడవారికి పనేందుకు అని కొందరు, ఆడవారు సముపాదించాల్సిన అవసరం ఏముంది అని మరి కొందరు ఏదో ఒక విధంగా వారిని నిరుత్సాహ  పరుస్తూనే ఉంటారు. దీనికి ఒక చక్కటి పరిష్కారంగా విదేశాలలో ఎప్పట్నించి ప్రాచుర్యంలో ఉన్న వర్క్

ఫ్రం హోమ్ అంటే ఇంటి నుండే పని చెయ్యటం అనే పద్ధతి ఈమధ్య ఇండియా లో పాపులర్ అవుతూ వస్తోంది. అయితే ముఖ్యంగా ఆడవారికి ఎంతో సౌకర్యంగా ఉండే ఈ work from home ఉద్యోగాలలో ఉన్న రకరకాల అవకాశాలను గురించి ఇపుడు తెలుసుకుందాము.

ముందుగా దాని కంటే ముందు వర్క్ ఫ్రం హోమ్ ను మీరు ఎందుకు ప్రిఫర్ చెయ్యాలి, లేదా అది ఎందుకు లేదా ఏ విధంగా సౌకర్యవంతం అనేది చూద్దాం.

  • సౌకర్యవంతమైన పని సమయం
  • కుటుంబం ఇంకా పిల్లలకి చేరువలో ఉండి పని చేయగలగడం
  • ఇంటి వద్ద నుండే డబ్బులు సంపాదించడం 
  • బ్రహ్మానండమైన వర్క్ లైఫ్ బాలన్స్

చూసారు కదా ఇన్ని చక్కని ఉపయోగాలు ఉన్నప్పుడు ఎందుకు ఒదులుకోవడం, మీరు ట్రై చెయ్యండి. ఇపుడు ఇండియా లో మీరు వర్క్ ఫ్రం హోమ్ చెయ్యాలనుకుంటే మీకు ఉన్న అవకాశాలను గురించి  చూద్దాం.

కంటెంట్ రైటింగ్

చాలా ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కలిగి ఉన్న ఫీల్డ్ లలో ఈ కంటెంట్ రైటింగ్ కొద ఒకటి అని చెప్పాలి. ప్రస్తుతం ఇంటర్నట్ ప్రపంచంలో అందరు చూసేది , అందరికి కావాల్సినది కంటెంట్. అయితే అటువంటి కంటెంట్ ను మీరు అందించగలరు అనే నమ్మకం మీకు ఉన్నట్లైతే గనుక మీరు కంటెంట్ రైటింగ్ ను ట్రై చెయ్యచ్చు. రైటింగ్ పట్ల ఆసక్తి , కాస్త అవగాహనా ఉంటె అలా అలా నేర్చుకుంటూ ఈ రంగంలో బాగా రాణించవచ్చును.

సోషల్ మీడియా మేనేజ్మెంట్

కంపెనీ తమ ఉనికి ని చాటుకోవడానికి , కస్టమర్ లతో టచ్ లో ఉండటానికి సోషల్ మీడియా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అయితే ఇది కంపెనీ లకు ఒక పెద్ద టైం చొన్సుమింగ్ ప్రాసెస్ అనే చెప్పాలి. కాబట్టి వారు సాధారణంగా ఇటువంటి పనుల కోసం వేరే వారిని అప్పోయింట్ చేస్కుంటూ ఉంటారు. అయితే మీకు సోషల్ మీడియా పేజెస్ మేనేజ్ చెయ్యటం ఇంటరెస్ట్ ఉంటె మీరు ఇది ట్రై చెయ్యచ్చు. మీ క్రియేటివ్ ఇంకా ఇన్నోవేటివ్  థాట్స్ తో కంపెనీ ని ప్రజల్లోకి చేరేలా చెయ్యటమే మీ పని.

Vlogging  

ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా పాపులర్ అయినా ఒక సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ విధానం ఈ vlogging అని చెప్పాలి. సింపుల్ గ చెప్పాలంటే ఇది ఒక blog కి వీడియో ఫార్మ్. అయితే ఈ vlogs లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ను మీరు జనాలకు అందిస్తారనేది మీ ఇంటరెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. మీకు వంటలు ఆసక్తి ఉంటె , మీకు వోచిన కొన్ని డెలీషియస్ రెసిపీస్ ను vlogs రూపంలో పెడితే వంట రానివారు చూసి నేర్చుకుంటారు. అదే ఒకవేళ మీకు క్రాఫ్ట్స్ చెయ్యటం ఆసక్తి ఉంటె అవి కూడా ట్రై చెయ్యచ్చు. దీని కోసం మీకు కావాల్సిందల్లా కేవలం ఒక మంచి క్వాలిటీ కెమెరా , ఇంకా కాస్త ఎడిటింగ్ పైన అవగాహన అంతే.

వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్

వీడియో కంటెంట్ తయారు చేసే వారికి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే వారి అవసరం చాలానే  ఉంది. అయితే,, ఇది చాలా సింపుల్ పనే, మీకు రోజులో ఎంతో సమయం కూడా పట్టదు , అలాగే వీడియో చేసేవారే మీకు కంటెంట్ ను కూడా ఇస్తారు గనుక మీ పని కేవెలం ఆ కంటెంట్ ను వోయి రూపంలోకి మార్చటమే. బాగుంది కదా ఈ సింపుల్ వర్క్ ఫ్రం హోమ్ అవకాశం. ఖచ్చితంగా ట్రై చెయ్యండి.

ఆన్లైన్ ట్యూషన్స్

మీకు  ఇంతకు ముందు టీచర్ గ పని చేసిన అవగాహన ఉన్నట్లయితే గనుక ఈ ఆన్లైన్ ట్యూషన్స్ మీకు సరైన సంపాదన విధానం అనే చెప్పాలి. దీని కోసం మీకు కావాల్సినదల్లా ఏదో ఒక సబ్జెక్టు పైన స్పష్టమైన అవగాహన. మీకు బాగా ప్రావీణ్యం ఉన్న సబ్జెక్టు ను ఎంచుకొని ఆన్లైన్ లో ఆ సబ్జెక్టు లో ట్యూషన్స్ ఇవ్వటం ద్వారా మీరు ఇంటి నుండే సంపాదించవచ్చును. ఇలా మీరు ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పటానికి ఆసక్తి చూపిస్తే గనుక మీకు ఉపయోగపడే వెబ్సైట్లు అనేకం అందుబాటులో ఉన్నాయి.

చూసారు కదా ఇన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఇంటి నుండే కాలు బయట పెట్టక్కర్లేకుండా డబ్బులు సంపాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీ సెర్చ్ ను ప్రారంభించండి.   

Language